నటిగా రంగ ప్రవేశం చేసిన అమీర్‌ మేన కోడలు

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ మేన కోడలు జాయాన్‌ మేరీ ఖాన్‌ నటిగా సినీ ప్రవేశం​ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ప్రఖ్యాత సిరిస్‌ ద్వారా  అమీర్‌ వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. కాగా తాను నటించిన ‘మిసెస్ సీరియల్‌ కిల్లర్‌’  నెట్‌ఫ్లిక్స్‌లో శనివారం విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రీమియర్‌ షోను అమీర్‌ ‌ ఇంటి కుటుంబంతో కలిసి వీక్షించారు. ఇంట్లోనే ప్రోజెక్టర్‌ ద్వారా ఈ షో చూసిన అమీర్‌.. తన భార్య కిరణ్‌ రావ్‌, కూతురు ఇరా ఖాన్తో కలిసి చూసేందుకు సూట్‌తో హజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇరా తన ఇన్‌స్టాగ్రామలో శనివారం షేర్‌ చేశారు. (‘ప్రభాస్‌-అమీర్‌లతో మల్టీస్టారర్‌ చిత్రం చేయాలి’)