రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌ కలిసి చేసిన వెబ్‌ సిరిస్‌ ‘ఇన్‌టూ ద వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’. డిస్కవరీ ఛానెల్‌ రూపోదించిన ఈ వెబ్‌ సిరిస్‌ ప్రత్యేక ఎపిసోడ్‌ విడుదలైనప్పటినుంచి సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రియాలిటీ టెలివిజన్‌ షో ప్రీమియర్‌ ఎపిసోడ్‌ మార్చి 23న డిస్కవరీ నెట్‌వర్క్‌(12 ఛానెల్స్‌)లో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ఈ షో రెండో అత్యధిక రేటింగ్‌ సాధించిన రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. ఇక ఈ ఏడాదిలో అధిక రేటింగ్‌ సాధించిన రియాలిటీ షోగా, అదేవిధంగా రియాలిటీ షోల చరిత్రలోనే అత్యధిక రేటింగ్‌ పొందిన రెండో ప్రదర్శనగా రికార్డు సృష్టించింది.