శ్రీకాకుళం : వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరిచేస్తుంటే.. బాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇసుకను భారీగా దోపిడీ చేసిందని, నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్‌లను దోచి పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే చంద్రబాబు తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు.. చంద్రబాబుపై నమ్మకం లేకే ముఖ్య నేతలంతా రాజీనామా చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తప్పదని తెలిసే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారని పేర్కొన్నారు. (ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం)
అందుకే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారు